Business Idea: మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. ఇంటి నుంచే నెలకు లక్షన్నర సంపాదించే ఛాన్స్..
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:54 PM
Business Idea: ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే పనిచేసుకుని మంచి ఆదాయం వచ్చే దారేదని వెతుకుతున్నారా. అయితే, ఈ ఐడియా మీకోసమే. మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే చాలు. ఇంట్లో నుంచే టెన్షన్ లేకుండా ఈ పని చేసి ఈజీగా నెలకు లక్షన్నర సంపాదించవచ్చు.

Business Idea: ఉద్యోగులు రూల్ ప్రకారం రోజుకు కచ్చితంగా 8 గంటలు ఆఫీసులో వర్క్ చేసితీరాల్సిందే. కానీ, సిటీల్లో జాబ్ చేసేవాళ్లు అదనంగా ఇంకో రెండు మూడు గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే, చాలామందికి ఆఫీసు ఇంటికి దూరంగా ఉంటుంది. రోజు మొత్తం పని చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. స్వంత పనులకు, వ్యక్తిగత జీవితానికి దూరమవుతుంటారు. దీనికి తోడు ఆఫీసు పనిఒత్తిడి సరేసరి. అందుకే ఈ మధ్య చాలామంది వర్క్ ఫ్రం హోం లేదా ఓన్ బిజినెస్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీరూ అలాగే ఆలోచిస్తుంటే ఈ సూపర్ ఐడియా మీకోసమే. కేవలం ఒక ల్యాప్‌టాప్ మీ దగ్గర ఉంటే చాలు. ఇంటి నుంచి ఈ పనితో ఈజీగా నెలకు లక్షన్నర సంపాదించవచ్చు. అదెలాగంటే..
ఇప్పుడు దేశంలో ప్రతి చోటా అద్దె ఇళ్లలో నివసించే వాళ్లే ఎక్కువ. పల్లెలు, టౌన్లతో పోలిస్తే సిటీల్లో ఇళ్లు వెతుక్కోవడం కష్టం. ఎంత మొత్తంలో అద్దెకు తీసుకోవాలి. ఎలాంటి ఇల్లు కావాలి. అని అద్దెకు తీసుకునేవాళ్లు ఆలోచిస్తే.. నచ్చిన వారికే ఇవ్వాలని ఇంటి యజమానులు కోరుకుంటారు. ఇదంతా ఏంటని అనుకుంటున్నారు. మరేం లేదు. యజమాని, అద్దెదారులు ఇరువురి అవసరాలకు అనుగుణంగా మీరు మధ్యవర్తిగా మారడమే ఈ బిజినెస్.ఒక ల్యాప్‌టాప్ సాయంలో వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుని ఈ సమస్యను మీరెలా పరిష్కరించి డబ్బు సంపాదించవచ్చో తెలుసుకుందాం.
ముందుగా మీరు ఒక నగరాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఉన్నఆస్తుల జాబితా రూపొందించుకోవాలి. ఆన్‌లైన్ అద్దె ప్రాపర్టీ వెబ్‌సైట్ సృష్టించి ఇంటి యజమానులు, అద్దెదారుల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచాలి. ఖాళీగా ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ వివరాలను నమోదు చేసుకుని హౌస్ ఓనర్లు శాకాహారులు, మాంసాహారులు ఇలా ఏ రకమైన కుటుంబాలకు ఇవ్వాలి కోరుకుంటున్నారో అవి లిస్ట్ చేయాలి. ఇళ్లు ఖాళీ అయినా లేదా ఫిల్ అయినా, అద్దె ధర తదితర వివరాల గురించి యజమానితో కాంటాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి.
కమిషన్
ఒక యజమాని తన ఆస్తిని మీ వెబ్‌సైట్లో లిస్ట్ చేశాక ఎవరైనా అద్దెదారు దానిని బుక్ చేసుకుంటే ప్రతి బుకింగ్‌పై మీ వెబ్‌సైట్ ఆటోమేటిగ్గా కమీషన్ వసూలు చేస్తుంది.
యాడ్స్
వెబ్‌సైట్‌లో డైరెక్ట్ యాడ్ స్పేస్ విక్రయించడం ద్వారా లేదా గూగుల్ యాడ్‌సెన్స్ అమ్మకం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇందులో గృహ సేవలు అంటే ఫర్నిచర్,ఇంటీరియర్ డిజైన్, రుణ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మీకు బిజినెస్ యాడ్స్ ఇచ్చే అవకాశం ఉంది.
లోన్, బీమా సేవలతో సంపాదన
అద్దె ఆస్తి వెబ్‌సైట్‌లు హోం లోన్, ప్రైవేట్ బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకుని అదనంగా కమీషన్‌లను ఆర్జించవచ్చు. ఎలాగంటే, ఎవరికైనా ఇంటి రెంట్ కోసం లేదా ఇంటికోసం లోన్ అవసరమైతే వెబ్‌సైట్ ద్వారా భాగస్వామి బ్యాంకు లేదా NBFCకి కనెక్ట్ చేసి కమీషన్ డబ్బు పొందవచ్చు.
లిస్టింగ్ ఫీజులు
హౌస్ ఓనర్లు తమ అద్దె ఆస్తిని వెబ్‌సైట్లో లిస్ట్ చేసినందుతు నెలవారీ లేదా సంవత్సరం మొత్తానికి కలిపి ఫీజు వసూలు చేస్తారు. కొన్ని వెబ్‌సైట్లు ఫ్రీగా లిస్టింగ్ అందిస్తే మరికొన్ని ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తాయి.
ప్రీమియం సభ్యత్వం
యజమానులు త్వరగా అద్దెకు ఇచ్చేందుకు తమ ఆస్తి అందరికీ కనిపించేలా ఉండాలని కోరుకుంటే మీరు ఎక్స్ ట్రా ఛార్జీలు విధించవచ్చు. దీన్ని 'టాప్ లిస్టింగ్', 'ఫీచర్డ్ ప్రాపర్టీ' సర్వీసెస్ అంటారు.
లీజింగ్ , ఆస్తి నిర్వహణ సేవలు
కొన్ని వెబ్‌సైట్లు రెంట్ సర్వీసెస్‌తో పాటు పూర్తిగా ఆస్తి నిర్వహణ సేవలను అందిస్తాయి. అద్దెదారుని కనుక్కోవడం, పేపర్ వర్క, నిర్వహణ పనులన్నీ చేస్తాయి. ఇందుకోస నెలవారీ లేదా బుకింగ్ ప్రాతిపదికన డబ్బు వసూలు చేయచ్చు.
రిలేటెడ్ మార్కెటింగ్ ద్వారా సంపాదన
వెబ్‌సైట్‌లో ఇంటికి కావాల్సిన ఫర్నిచర్, వస్తువులు, సీసీ కెమెరాలు వంటి గృహ సంబంధిత ఉత్పత్తులను ప్రచారం చేసి కమిషన్ సంపాదించవచ్చు. ఇదే కాక, కస్టమర్లకు అద్దె డీలింగ్స్, హై-ప్రొఫైల్ ప్రాపర్టీలను యాక్సెస్ చేసుకోవడానికి సబ్‌స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేయవచ్చు.
ఇంటి యజమానులకు లాభమేంటి?
ఇల్లు త్వరగా దొరుకుతుందని ఆన్‌లైన్ ద్వారానే ఈ మధ్య వేలాది మంది అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వెబ్‌సైట్లు ఉంటే యజమానులు తమకు నచ్చిన వారికి బ్రోకర్ సాయం లేకుండా అద్దెకు ఇచ్చే అవకాశం లభిస్తుంది.
Read Also: Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Business Idea : రూ.4వేలు ఉంటే చాలు.. ఈ పనితో ఇంటి నుంచే ప్రతి నెలా రూ ...
New Business Idea: ఈ చెట్టు ఆకులు అమ్మితే ఏడాదంతా డబ్బే డబ్బు ...