Share News

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:15 PM

ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబైని ఆదుకునేందుకు మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా
Jasprit Bumrah

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌కు ఓ శుభవార్త. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (IPL 2025) ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబైని ఆదుకునేందుకు మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (NCA)లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా ఈ ఏడాది జనవరి నుంచి క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే.


ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసి గాయపడ్డాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరమయ్యాడు. తాజా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఆడుతున్న బుమ్రా జట్టుతో మాత్రం చేరలేదు. బుమ్రా లేకపోవడంతో ముంబై టీమ్ చాలా ఇబ్బంది పడుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. బుమ్రా వస్తే ముంబై బౌలింగ్ కచ్చితంగా బలోపేతం అవుతుందని అందరూ నమ్ముతున్నారు.


చాలా రోజులు క్రికెట్‌కు దూరమైన బుమ్రా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ బుమ్రా బౌలింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకుంటేనే మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. బుమ్రా ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏప్రిల్‌ మధ్యలో ముంబై జట్టుతో బుమ్రా చేరే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్


IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా


IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 05:16 PM