స్థానిక వనరులను వినియోగించుకుందాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

ABN , First Publish Date - 2021-01-28T04:39:00+05:30 IST

స్థానిక వనరులను వినియోగించుకుని పట్టణ అభివృద్ధికి తోడ్పాటునందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

స్థానిక వనరులను వినియోగించుకుందాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
రామనగరం సర్పంచ్‌ని సన్మానిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, జనవరి 27: స్థానిక వనరులను వినియోగించుకుని పట్టణ అభివృద్ధికి తోడ్పాటునందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మునిసిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మునిసిపాలిటీ పాలకవర్గాన్ని బుధవారం ఆయన సన్మానించారు. స్పష్టమైన ప్రణాళికలు వేసుకుని నిధుల విషయంలో అంచనాకు రావాలని కోరారు. గతంలో ఇప్పుడు బేరీజు వేసుకుని అవసరాలను అంచనా వేయాలని, గౌరవాన్ని కాపాడేలా నిధులు తీసుకువచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. 


రామానగరం సర్పంచ్‌కి సన్మానం


అభివృద్ధి, సంక్షేమంలో గ్రామాన్ని ముందుకు నడిపించిన మండలంలోని రామానగరం సర్పంచ్‌ వేల్పుల కళావతిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష్యుడు యాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-28T04:39:00+05:30 IST