సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-01-26T04:59:57+05:30 IST

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

ములుగు కలెక్టరేట్‌, జనవరి 25: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ నూతన టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ములుగు, ఏటూరునాగారం సబ్‌ డివిజన్ల పోలీసు అధికారులతో వేర్వేరుగా వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు హెల్మెట్‌, సీటుబెల్టు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్లలో వర్టికల్‌ సిస్టం బలోపేతం చేయాలని, సిబ్బందికి క్రమం తప్పకుండా వర్టికల్‌ సిస్టంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సాయిచైతన్య, గౌస్‌ఆలం, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కుమారస్వామి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T04:59:57+05:30 IST