Share News

ప్రైవేట్‌ కళాశాలల్లో నిలిచిన ప్రాక్టికల్స్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:42 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ప్రైవే ట్‌ కళాశాలల యాజమాన్యాలు, వేతనాల కోసం లెక్చరర్ల బహిష్కరణ ప్రభావం డిగ్రీ ప్రాక్టికల్స్‌ పరీక్షలపై ప్రభావం చూపింది. ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రాక్టికల్స్‌ పరీక్షలు ప్రారంభమైనా, ప్రైవేట్‌డిగ్రీ కళాశాలలు తెరుచుకోలేదు.

ప్రైవేట్‌ కళాశాలల్లో నిలిచిన ప్రాక్టికల్స్‌

డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్ల నిరసన

ప్రభుత్వ కళాశాలల్లోకొనసాగిన పరీక్షలు

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ప్రైవే ట్‌ కళాశాలల యాజమాన్యాలు, వేతనాల కోసం లెక్చరర్ల బహిష్కరణ ప్రభావం డిగ్రీ ప్రాక్టికల్స్‌ పరీక్షలపై ప్రభావం చూపింది. ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రాక్టికల్స్‌ పరీక్షలు ప్రారంభమైనా, ప్రైవేట్‌డిగ్రీ కళాశాలలు తెరుచుకోలేదు. దీంతో ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ స్తంభించగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రభుత్వ యాజమాన్య గురుకుల కళాశాలల్లో మాత్రం షె డ్యూల్‌ ప్రకారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే ఈనెల 11 నుంచి ప్రారంభమ య్యే థియరీ పరీక్షలను కూడా బహిష్కరిస్తామ ని యాజమాన్యాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో డిగ్రీ విద్యార్థులు,తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే రెండుమూడు రోజుల్లో సమ స్య కొలిక్కి వస్తుందని, ప్రైవేట్‌ విద్యార్థులు నష్టపోకుండా పరీక్షల రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎంజీయూ అధికారులు పేర్కొంటున్నారు.

నిరసనల పర్వం..

డిగ్రీ ప్రాక్టికల్స్‌ పరీక్షల మొదటి రోజున ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్‌ కళాశాలల వద్ద నిరసనల పర్వం కొనసాగింది. యాజమాన్యాల ప్రతినిధులు, లెక్చరర్స్‌ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. అయితే ప్రాక్టికల్స్‌ను బహిష్కరిస్తున్నట్టు ముందే ఇచ్చిన సమాచారంతో విద్యార్థులు కళాశాలలకు రాలేదు. ఏ-గ్రూపులో 2, 4, 5వ సెమిస్టర్‌ ప్రాక్టికల్స్‌ 7, 8, 9వ తేదీల్లో జరగనున్నాయి. ప్రాక్టికల్స్‌ ముగిసిన రెండు రోజుల అనంతరం ఈ నెల 11వ తేదీ నుంచి థియరీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది.

ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె

పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తాం. భారీగా పేరుకుపోయిన బకాయితో యాజమాన్యాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రాక్టికల్స్‌ పరీక్ష లు బహిష్కరిస్తున్నాం. అందుకు గత అక్టోబరులో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోకపోవడమే కారణం. ప్రభుత్వ వైఖరి మారకుం టే ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యే థియ రీ పరీక్షలను కూడా బహిష్కరిస్తాం.

- డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

Updated Date - Apr 03 , 2025 | 12:42 AM