Share News

Israel Drops Tariffs: అమెరికా ఉత్పత్తులపై ఇజ్రాయెల్‌ సుంకం రద్దు

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:54 AM

ఇజ్రాయెల్‌ అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అన్ని సుంకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుందని వెల్లడించింది

Israel Drops Tariffs: అమెరికా ఉత్పత్తులపై ఇజ్రాయెల్‌ సుంకం రద్దు

జెరూసలేం, ఏప్రిల్‌ 2: ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అధికారిక ప్రకటన చేయనున్న వేళ ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి తమ దేశానికి అయ్యే అన్ని దిగుమతులపై వసూలు చేసే సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్‌ ప్రధాని, ఆర్థిక శాఖ కార్యాలయాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ నిర్ణయం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ఇజ్రాయెల్‌ పౌరుల ఖర్చులను తగ్గిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. నిజానికి, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో 99ు వాటిపై ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులపై మాత్రమే సుంకాలు విధిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Poonam Gupta: కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా గురించి తెలుసా..

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

Updated Date - Apr 03 , 2025 | 03:54 AM