Share News

Student: స్టెచర్‌పై వచ్చి.. టెన్త్‌ పరీక్ష రాసి!

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:48 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ టెన్త్‌ విద్యార్థి.. ఆస్పత్రి నుంచి స్టెచర్‌పైనే వచ్చి పట్టుదలతో పరీక్ష రాశాడు.

Student: స్టెచర్‌పై వచ్చి.. టెన్త్‌ పరీక్ష రాసి!

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ టెన్త్‌ విద్యార్థి.. ఆస్పత్రి నుంచి స్టెచర్‌పైనే వచ్చి పట్టుదలతో పరీక్ష రాశాడు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాప్‌ సమీపంలోని భాష్యం హైస్కూల్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వతేజ (15) ట్యూషన్‌కు వెళ్తుండగా శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.


అయితే బుధవారం చివరి పరీక్ష ఉండటంతో ఎలాగైనా రాస్తానని తండ్రి నాగరాజుతో చెప్పడంతో.. ఆయన భాష్యం ప్రిన్సిపాల్‌ శ్రీదేవిని సంప్రదించారు. ఆమె మానవతా దృక్పథంతో ఆలోచించి డీఈవోతో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. దీంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేక గదిలో ఓ ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేయడంతో విశ్వతేజ పరీక్ష రాశాడు.

Updated Date - Apr 03 , 2025 | 03:48 AM