Ambati Rambabu: ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు

ABN , First Publish Date - 2022-12-20T17:13:41+05:30 IST

Palnadu: జనసేన పార్టీ (Janasena), వైసీపీ(YCP)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మృతుడి కుటుంబానికి పరిహారంగా వచ్చిన డబ్బులో కొంతభాగాన్ని మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు

Palnadu: జనసేన పార్టీ (Janasena), వైసీపీ(YCP)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మృతుడి కుటుంబానికి పరిహారంగా వచ్చిన డబ్బులో కొంతభాగాన్ని మంత్రి అంబటి రాంబాబు తీసుకున్నాడని జనసేన పార్టీ ఆరోపణ. అయితే ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని కౌంటర్ ఇచ్చారు అంబటి.

అనిల్ కుమార్ అనే వ్యక్తి గతంలో ప్రమాదవశాత్తూ చనిపోవడంతో కుటుంబసభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద రూ. 5 పరిహారం మంజూరైంది. అయితే మృతుడి కుటుంబానికి రూ. 3 లక్షలు మాత్రమే అందింది. మిగతా రూ. 2 లక్షలను మంత్రి అంబటి రాంబాబు తీసుకున్నాడని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. అవినీతికి పాల్పడిన అంబటి వెంటనే తన పదవిని రాజీనామా చేయాలని జనసేన కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు.

అనిల్‌కు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ గురించి అడిగిన కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ..కార్యాలయం‌ ఆవరణలో బైఠాయించారు. ఇటు ఆర్డీవో రాజకూమారి అందుబాటులో లేరు.

తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అంబటి రాంబాబు సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మృతుల పరిహారం కాజేసే దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నాను. ఆగస్టు 22న మృతుడి కుటుంబానికి రూ.5లక్షలను తానే ఇప్పించానని చెప్పారు.

ప్యాకేజీ తీసుకుని సన్యాసి రాజకీయాలు తాను చేయనని జనసేన పార్టీ అధినేత పవన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జేబు పార్టీ తనపై ఆరోపణలు చేస్తే ఉరుకోనని హెచ్చరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. మృతుల ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలు తమ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు.

Updated Date - 2022-12-20T17:13:43+05:30 IST