Share News

చెత్త నుంచి సంపద సృష్టించాలి

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:14 AM

చెత్త నుంచి సంపదను సృష్టించాలని ఆదోని డీఎల్‌పీవో నూర్జహాన, ఈవోఆర్డీ అనంతశయన సిబ్బంది సూచించారు.

చెత్త నుంచి సంపద సృష్టించాలి
చెత్త నుంచి సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

గోనెగండ్ల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): చెత్త నుంచి సంపదను సృష్టించాలని ఆదోని డీఎల్‌పీవో నూర్జహాన, ఈవోఆర్డీ అనంతశయన సిబ్బంది సూచించారు. గోనెగండ్ల పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఇంటింటి వెళ్లి తడి చెత్తను పొడిచెత్తను ప్రతి రోజు సేకరిస్తున్నారా? లేదా? అని చెత్త సేకరణ సిబ్బందితో పాటు ఆదివారం ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. డివిజనలోని అన్ని గ్రామాలలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచలు పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని సూచించారు. డీఎల్‌పీవో మాట్లాడుతూ ఇళ్ల దగ్గర ఉన్న చెత్తను తీసుకువచ్చి వర్మీ కంపోస్టు తయారు చేసి అమ్మకాలు జరిపి ఆయా పంచాయతీలకు ఆదాయం తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ పంచా యతీ కార్యదర్శులను ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్‌ కింద ఈ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పంచా యతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 01:14 AM