Minister Peddireddy మీడియా ప్రశ్నలకు మంత్రి పెద్దిరెడ్డి వింత సమాధానాలు
ABN , First Publish Date - 2022-10-28T14:36:24+05:30 IST
మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వింత సమాధానాలు చెప్పారు.
అమరావతి: మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra reddy) వింత సమాధానాలు చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి... అమరావతిలో ఒకే వర్గానికి చెందిన భూముల ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని అన్నారు. గ్రామాల్లో ఒకే వర్గానికి చెందిన రైతులే ఉంటారా అని మీడియా ప్రతినిధి అడిగారు. అయితే ఎక్కువ భుములు టీడీపీ (TDP) వాళ్లవే అంటూ మంత్రి సమాధానం దాటవేశారు. విశాఖ వెళ్తున్న టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారన్న ప్రశ్నకు కూడా సమాధానం దాటవేశారు. రిషికొండ (Rishikonda issue) నిషేధిత ప్రాంతమా అన్న ప్రశ్నకు కూడా పెద్దిరెడ్డి (AP Minister) సమాధానం చెప్పలేదు. ఇదే విధంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (YCP Leader) సమాధానాలు దాట వేశారు. రాయలసీమలో ఎవరూ పాలనా రాజధాని కోరుకోవడం లేదని తెలిపారు. మూడు రాజధానులు తమ సీఎం (YS Jagan mohan reddy) అభిమతమని.. నాయకులందరూ పాటిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.