ఆటోనగర్‌ వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-12-09T01:13:21+05:30 IST

ఆటోనగర్‌ వై జంక్షన్‌ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలి కేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు వచ్చారు.

ఆటోనగర్‌ వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం
చంద్రబాబు రాకకేౖ హైవేపై ఎదురుచూస్తున్న పలు గ్రామాల టీడీపీ శ్రేణులు

పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

అధినేతకు ఆత్మీయంగా హారతి పట్టిన మహిళలు

పెదకాకాని, డిసెంబరు 8 : ఆటోనగర్‌ వై జంక్షన్‌ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలి కేందుకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు వచ్చారు. నారా కోడూరు, పొన్నూరులో ‘ఇదేమి కర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో భాగంగా జరిగే బహిరంగ సభలో పాల్గొ నేందుకు వెళ్తూ మార్గమధ్యలోని ఆటోనగర్‌ వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలకు, మహిళలకు ఆయన అభివాదం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. పెదకాకాని మం డల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. నంబూరు, వెనిగండ్ల, కొప్పురావూరు, పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, వెంకట కృషా ్ణపురం, అగతవరపాడు, ఆటోనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకసారిగా హైవేపై ప్రజలు తరలి రావ డంతో చంద్రబాబు కాన్వాయ్‌ని ఆపించారు. పార్టీ నాయకులు, మహిళలు విశేషంగా తరలి రావడంతో చంద్రబాబు చిరు నవ్వుతో అందరికీ అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి హైవే మీద బుడంపాడు వైపు వెళ్లారు. ఈ కార్యక్ర మంలో మండల టీడీపీ వలివేటి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీనివాసరావు, గ్రామ పార్టీ నాయకులు బోయపాటి రామ్మోహన్‌, మండల నాయకులు కె.బ్రహ్మా రెడ్డి, మాకిరెడ్డి జయ రామిరెడ్డి, మలినేని రుక్మిణి, శివాల యం మాజీ చైర్మన్‌ పెద్ది రాధా, సుశీలరావు, ధూళిపాళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T01:13:24+05:30 IST