Share News

Kaveri Hospital: 4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:07 PM

4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి చేశారు వైద్య నిపుణులు. చెన్నైలోని వడపళని కావేరి హాస్పిటల్‌లో నాలుగు నెలల పసికందుకు అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

Kaveri Hospital: 4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి

చెన్నై: స్థానిక వడపళని కావేరి హాస్పిటల్‌(Kaveri Hospital)లో నాలుగు నెలల పసికందుకు అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి పీడియాట్రిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ డి.శివరామన్‌(Pediatric Consultant Dr. D. Shivaraman) తెలిపారు. గురువారం ఉదయం ఆస్పత్రిలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ పసికందు తల్లి కాలేయంలో కొంత భాగం స్వీకరించి ఈ శస్త్రచికిత్సను 8 గంటలపాటు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Online Rummy: రూ.50 లక్షలు పోగొట్టుకొని.. చివరకు విగతజీవిగా..


nani5.2.jpg

ప్రస్తుతం ఆ పసికందు సంపూర్ణంగా కోలుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి జీవిత భీమా పథకం కింద ఆ పసికందుకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్నారు. మీడియా సమావేశంలో డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ జయకుమార్‌, డాక్టర్‌ విఘ్నేశ్వరన్‌, డాక్టర్‌ స్వామినాధన్‌ సంబంధం, డాక్టర్‌ సత్యనారాయణన్‌, మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ పూర్ణచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 01:07 PM