AP NEWS: మడమ తిప్పడంలో జగన్ సిద్ధహస్తులు: పీతల సుజాత
ABN , First Publish Date - 2022-09-24T01:39:02+05:30 IST
మాట ఇచ్చి మడమ తిప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిద్ధహస్తులని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.
అమరావతి: మాట ఇచ్చి మడమ తిప్పడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN REDDY) సిద్ధహస్తులని మాజీ మంత్రి పీతల సుజాత(PITALA SUJATHA) అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి మహిళకు లక్షా ఐదువేల రూపాయలు ఎగనామం పెట్టారని మండిపడ్డారు.పెన్షన్ రూ.3వేలు ఇస్తామన్న హామీకి తొలి సంతకంతోనే సీఎం జగన్ తూట్లు పొడిచి..రూ.250 పెంచి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ఏటా పెంచుకుంటామన్న పెన్షన్ హామీకి రెండేళ్లు గడుస్తున్నా దిక్కు లేదన్నారు.రెండేళ్లలో రూ.18వేల చొప్పున ఎగనామం పెట్టారన్నారు.
మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీని అసెంబ్లీ సాక్షిగా తూట్లు పొడిచారన్నారు.చేయూత కాదు... మహిళా సంక్షేమంలో జగన్‌రెడ్డి చేతివాటం చూపారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.7,500 మాత్రమే. అది కూడా 3 విడతల్లోనని దెప్పిపొడిశారు.పర్ హెడ్ మూడు వేలు ఇస్తే ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి రూ.36 వేలు రావాలి, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.కోటి మంది మహిళలకు 5 సంవత్సరాలకు లక్షా 80 వేలు ఇవ్వాలి కానీ 75 వేలే ఇస్తామని చెప్పారని. ఇది అన్యాయం కాదా అని నిలదీశారు.చేయూత పథకం ద్వారా కేవలం 26 లక్షల మంది మహిళలకు మాత్రమే 75 వేల రూపాయలు ఇస్తామనడం వారిని మోసం చేయడమేనని పీతల సుజాత అన్నారు.