Mega Health Hub: ఆరోగ్య రంగంలో సంస్కరణలు.. చంద్రబాబు విజన్ ఇదే
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:00 PM
Mega Health Hub: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 19,264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నామని.. ఆశించిన ఫలితాలు మాత్రం రావడంలేదన్నారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని.. అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు.

అమరావతి, ఏప్రిల్ 7: అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సోమవారం మీడియాతో సీఎం.. ఏపీలో వైద్యం, ఆరోగ్యంపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. మొత్తం 200 ఎకరాలు ఇందుకు అవసరం అవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేస్తుందన్నారు. అమరావతిలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేస్తామన్నారు. అతి త్వరలో దీనిపైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
100 పడకల ఆస్పత్రి
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 19,264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నామని.. ఆశించిన ఫలితాలు మాత్రం రావడంలేదన్నారు. ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని.. అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో 100 - 300 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో గుండె సంబంధిత ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉందన్నారు. ప్రకాశం, కర్నూలు అనంతపురంలో రెస్పిరేటరి సంబంధిత వ్యాధులు వ్యాప్తి జరుగుతోందని సీఎం అన్నారు.
ఆ జిల్లాలో వ్యాధుల తక్కువ
ఎస్సీడీ సర్వే 2.0 జరిగిందని.. ఇప్పుడు 3.0 జరుగుతోందన్నారు. ఐదేళ్లలో ఆసుపత్రులకు వచ్చిన డేటా ఆధారంగా ఏ జిల్లాల్లో ఏ వ్యాధి ఎక్కువ అనే లిస్ట్ సిద్ధం చేశామన్నారు.8 లక్షల మంది బీపీ, షుగర్ బాధితులు చికిత్స తీసుకోవడం లేదన్నారు. షుగర్ వ్యాధి స్త్రీలు, పురుషులకు సమానంగా వస్తోందని తెలిపారు. ఆహారపు అలవాట్ల వల్లే షుగర్ ఎక్కువగా వస్తోందన్నారు. ఆడవాళ్లలో గుండె సబంధిత వ్యాధులు తక్కువ వస్తున్నాయని తెలిపారు. క్యాన్సర్ విషయంలో ఆడవాళ్లు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారన్నారు. లివర్ సంబంధిత వ్యాధులు మగవారికి ఎక్కువగా వస్తున్నాయని.. దీనికి కారణం లిక్కర్ అని అన్నారు. న్యూరలాజికల్ ఇష్యూలు మిడిల్ ఏజ్‌లో ఎక్కువ వస్తున్నాయని చెప్పారు. మగవారికి హైపర్ టెన్షన్ తక్కువ అని.. ఆడవాళ్లకు ఎక్కువన్నారు. మహిళలు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నార అన్నారు. ఎక్కడ రైస్ ఎక్కువ తింటారో అక్కడ డయాబెటిక్ ఉందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో డయాబెటిక్ తక్కువగా ఉందని తెలిపారు. ఏపీలో మన్యం జిల్లాలో వ్యాధులు తక్కువగా ఉన్నాయని.. మంచి వాతావరణం, సాంప్రదాయ ఆహారం అందుకు కారణమని చెప్పుకొచ్చారు.
ఆ మూడు కంట్రోల్ చేస్తేనే
టాప్ టెన్ డిసీజెస్ కంట్రోల్‌కు ప్రపంచం ఏం చేస్తుందో చూశామన్నారు. నలుగురు ఉన్న ప్యామిలీ 600 మిల్లీ గ్రాములు సాల్ట్.. 3 కిలోల పంచదార వాడాల్సి ఉంటుందన్నారు. రోజుకు ఆరు, ఏడు సార్లు స్మాల్ మీల్ ప్రాక్టీస్ బావుంటుందన్నారు. స్వీడన్‌లో 25% తక్కువ ఉప్పు వేస్తే హర్ట్‌ఎటాక్స్ 40% తగ్గుతోందని తెలిపారు. క్యాన్సర్ విషయంలో స్కూల్ స్టేజ్‌లో 90% కవర్ చేశారన్నారు. సాల్ట్, షుగర్, ఆయిల్ కంట్రోల్ చేస్తే మంచిదన్నారు. రోజుకు అరగంట వాకింగ్ చేయాలని సూచించారు. ఇటీవలే ఏఐతో కూడిన న్యూట్రిషనల్ యాప్ తయారు చేశామని.. యాప్‌కు స్కోచ్ అవార్డు కూడా వచ్చిందని తలెపారు. ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారన్నారు.
మంచి అలవాట్లతో లైఫ్ హ్యాపీ
పొగాకు, ఆల్కహల్, డ్రగ్స్ దూరంగా ఉంటే మంచిదన్నారు. మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. పంజాబ్ క్యాన్సర్ క్యాపిటల్ అయిందని.. దీని కౌంటర్ కోసం నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నామన్నారు. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్.. కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ అని.. దీని వల్ల ప్రభుత్వ బడ్జెట్ కూడా తగ్గుతుందన్నారు. హ్యాపీగా ఉండాలంటే మంచి అలవాట్లు అవసరమన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే పిల్లలకు ఫుడ్ హ్యాబిట్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫేజ్ 2లో చిత్తూరులో 30 మండలాల్లో అమలు చేస్తామన్నారు. తరువాత స్టేట్ మొత్తం అమలు చేస్తామని తెలిపారు. హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్‌లో ఉంచుతామన్నారు. గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టూ టైం అందుబాటులో ఉంటుందన్నారు. మానిటరింగ్, అలెర్ట్‌లు ఎప్పటికప్పుడు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జూన్ 15కు కుప్పంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించి.. అనంతరం ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 70 చోట్ల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. మిగిలిన చోట్ల పీపీపీ మోడ్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.