అట్రాసిటీ కేసు నమోదు
ABN , First Publish Date - 2022-12-06T23:52:07+05:30 IST
మెట్టూరు బిట్-1 పంచాయతీలో సోమవారం అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.
కొత్తూరు: మెట్టూరు బిట్-1 పంచాయతీలో సోమవారం అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. హడ్డుబంగి మోహనరావు సంకిలి గ్రామ నిర్వాసితుడు కావడంతో ప్రభుత్వం మెట్టూరు బిట్-1లో ప్లాట్ నెంబర్ 340లో ఐదు సెంట్ల భూమిని కేటాయించింది. ఈ స్థలంలో మట్టి వేస్తుండగా అదే గ్రామానికి చెందిన బి.శ్రీను, పోతల లోకేష్, బి.కృష్ణారావు, బి.ఉమాశంకర్ స్థలం వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించడంతో పాటు లోకేష్ కట్టెలు కొట్టిన కత్తితో దాడికి యత్నించారు. ఈ ఘటనపై ఆదివారం మోహన రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ విజయకుమార్ గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. ఆయనతో పాటు సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐ గోవిందరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.