Adeep Raj: వైసీపీ ఆఫీస్‌లో పెందుర్తి ఎమ్మెల్యే సెల్‌ఫోన్ మిస్సింగ్
ABN , First Publish Date - 2022-12-21T14:38:12+05:30 IST
వైసీపీ కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సెల్‌ఫోన్ మిస్ అయ్యింది.
విశాఖపట్నం: వైసీపీ కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ (Pendurthi MLA Adeep Raj) సెల్‌ఫోన్ మిస్ అయ్యింది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సెల్‌ఫోన్ కనిపించకుండా పోయింది. ఫోన్ అత్యంత ఖరీదైనది కావడం.. విలువైన డేటా ఉండడంతో అదీప్ రాజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ దొరికిన వారు.. దయచేసి ఇవ్వాలని కొంతమంది నేతలు ప్రత్యేకంగా అనౌన్స్‌మెంట్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఫోన్ పోవడం ఏమిటని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.