రస్నా వ్యవస్థాపకుడు ఖంబట్టా కన్నుమూత
ABN , First Publish Date - 2022-11-22T03:26:47+05:30 IST
ప్రముఖ పానీ య ఉత్పత్తుల సంస్థ రస్నా వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా (85) ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో...
న్యూఢిల్లీ: ప్రముఖ పానీ య ఉత్పత్తుల సంస్థ రస్నా వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా (85) ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖంబట్టా..శనివారంనాడు గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించారని సోమవారం కంపెనీ ప్రకటించింది. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. మార్కెట్లో లభించే రెడీ టు డ్రింక్ శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఖంబట్టా 1970లో రస్నా బ్రాండ్‌నేమ్‌తో ప్రవేశపెట్టిన సాఫ్ట్‌డ్రింక్ పౌడర్ సాచెట్ ఉత్పత్తులకు అమిత ప్రాచుర్యం లభించింది. 80, 90 దశకాల్లో ‘ఐ లవ్ యూ రస్నా’ ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ 60 దేశాలకు విస్తరించింది. దేశీయంగా 18 లక్షల రిటైల్ కేంద్రాల్లో రస్నా ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. కంపెనీకి 9 తయారీ ప్లాంట్లతోపాటు దేశవ్యాప్తంగా 26 డిపోలు, 200 సూపర్ స్టాకిస్టులు, 900 సేల్స్ ఫోర్స్‌తో కూడిన పటిష్ఠమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది.