Indo-Pak Border: భారత్-పాక్ సరిహద్దులో తుపాకుల కలకలం.. పాక్ పనేనని అనుమానం
ABN , First Publish Date - 2022-08-24T01:29:53+05:30 IST
భారత్లోకి పాకిస్థాన్ అక్రమంగా ఆయుధాలను తరలిస్తుందని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. పంజాబ్లోని ఇండో-పాక్

పంజాబ్: భారత్లోకి పాకిస్థాన్ అక్రమంగా ఆయుధాలను తరలిస్తుందని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు ఆరు మేగజైన్లతో కూడిన ఏకే సిరీస్కు చెందిన మూడు రైఫిల్స్, నాలుగు మేగజైన్లతో కూడిన రెండు M3 సబ్ మెషీన్ గన్స్, రెండు మేగజైన్లతో కూడిన రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఫిరోజ్పూర్ సెక్టార్లో వీటిని గుర్తించారు. ఇవి పాకిస్థాన్ వైపు నుంచి రవాణా అయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.