Mysterious Stone: ఇదేం రాయి.. విచిత్రంగా ఇంత బరువుందేంటనుకున్నాడు.. నాలుగేళ్ల తర్వాత అదేంటో తెలిసి మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2022-11-25T19:50:44+05:30 IST

చాలా సార్లు మనం ఎంతో విలువైంది అనుకునే వస్తువు దొరకదు.. దొరికిన వస్తువు విలువ మనకు తెలియదు.. అస్ట్రేలియాలో ఒక వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.. అతను బంగారం కోసం తవ్వకాలు జరిపాడు.. ఎంత వెతికినా అతడికి బంగారం దొరకలేదు.. కాకపోతే ఒక విచిత్రమైన రాయి దొరికింది..

Mysterious Stone: ఇదేం రాయి.. విచిత్రంగా ఇంత బరువుందేంటనుకున్నాడు.. నాలుగేళ్ల తర్వాత అదేంటో తెలిసి మైండ్‌బ్లాక్..!

చాలా సార్లు మనం ఎంతో విలువైంది అనుకునే వస్తువు దొరకదు.. దొరికిన వస్తువు విలువ మనకు తెలియదు.. అస్ట్రేలియాలో ఒక వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.. అతను బంగారం కోసం తవ్వకాలు జరిపాడు.. ఎంత వెతికినా అతడికి బంగారం దొరకలేదు.. కాకపోతే ఒక విచిత్రమైన రాయి దొరికింది.. ఎందుకైనా పనికొస్తుందని ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నాడు.. నాలుగేళ్ల తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు.. తనకు దొరికిన రాయి బంగారం కంటే విలువైనదని, అరుదైనదని తెలుసుకుని షాకయ్యాడు.

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హోల్ అనే వ్యక్తి 2015లో మెల్‌బోర్న్ సమీపంలోని మేరీబరో రీజినల్ పార్క్‌లో బంగారం అన్వేషణ కోసం వెళ్లాడు. ఆ పార్క్ పందొమ్మిదో శతాబ్దంలో బంగారు గనిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కూడా బంగారం దొరుకుతుందేమోనని ప్రజలు అక్కడ వెతుకుతుంటారు. అలా వెతికిన కొందరికి బంగారం దొరికిన ఘటనలు కూడా ఉన్నాయి. డేవిడ్ హోల్ కూడా అదే నమ్మకంతో బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ అన్వేషణలో అతనికి బంగారం దొరకలేదు కాని ఓ రాయిని సంపాదించాడు. చాలా చిన్నగా ఉన్న ఆ రాయి బరువు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకైనా పనికొస్తుందని ఇంటికి తీసుకెళ్లి పెట్టుకున్నాడు. దానిని పగలగొట్టాలని ఎంత ప్రయత్నించినా అది పగల్లేదు.

సుత్తితో కొట్టినా, డ్రిలింగ్ చేసినా దానిపై చిన్న పగులు కూడా రాలేదు. యాసిడ్‌లో ముంచినా అది చెక్కు చెదరలేదు. దీంతో ఆ రాయి అంతు తేల్చేందుకు డేవిడ్ దానిని మెల్‌బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న రాయి నిజానికి ఓ ఉల్క అని తెలుసుకుని షాకయ్యాడు. ఆ రాయి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. తన దగ్గర ఉన్నది అరుదైన రాయి అని తెలుసుకున్న డేవిడ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated Date - 2022-11-25T19:50:46+05:30 IST