నాడు ఆధ్వానం.. నేడు ఆహ్లాదం
ABN , First Publish Date - 2022-11-29T23:21:39+05:30 IST
ఒకప్పుడు మధిర రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఎక్కడ చూసిన బడ్డీకొట్లు, ఆటో స్టాండ్‌లు దర్శనిమిచ్చేవి. కనీసం నిల్చునే అవకాశం ఉండకపోయేది. కానీ నేడు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.
మధిరటౌన్, నవంబరు 29: ఒకప్పుడు మధిర రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఎక్కడ చూసిన బడ్డీకొట్లు, ఆటో స్టాండ్‌లు దర్శనిమిచ్చేవి. కనీసం నిల్చునే అవకాశం ఉండకపోయేది. కానీ నేడు ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. బ్రిడ్జి కింద క్రోటాన్ మొక్కలు, పార్కు, పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మధిర ఆర్‌వోబీ కింద ఉన్న బడ్డీ కొట్లను, ఆక్రమణలను మధిర మునిసిపల్ అధికారులు తొలగించారు. తర్వాత వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. మునిసిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, పాలకవర్గం, అదికారులు రూ. 9 లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. వంతెన పిల్లర్లకు అందమైన పెయింటింగ్‌లు వేశారు. చుట్టూ కంచె నిర్మించారు. క్రోటాన్ మొక్కలు నాటారు. అందమైన బొమ్మలు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ఊయ్యాలలు, జారుడు బల్లలు ఇతర ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. దీంతో ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న వంతెన పరిసరాలు నేడు ఆహాదకరంగా మారాయి. ఫలితంగా పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.