మునిసిపాలిటీ సమగ్రాభివృద్ధే ధ్యేయం
ABN , First Publish Date - 2022-11-27T00:41:12+05:30 IST
సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాములునాయక్

వైరా, నవంబరు 26: వైరా సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. వైరా మునిసిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీసీకి చెందిన రూ.20కోట్లతో 1,2,3,4,5వార్డుల్లో నిర్మించిన సీసీ రోడ్ల శిలాఫలకాలను శనివారం ఎమ్మెల్యే రాములునాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాల్గోవార్డులో మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ అధ్యక్షతన కృతజ్ఞత అభినందన సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మునిసిపాలిటీలో కోట్లాదిరూపాయల అభివృద్ధి పనులు చేయించానని తెలిపారు.అభివృద్ధిలో తనకు అన్నివిధాలుగా సహకరిస్తున్న రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్‌చైర్మన్ సీతారాములు, కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, డేడీకుమారి, గీత, పద్మజా, సునీత, వేణు, నాగేశ్వరరావు, రామారావు, కోఆప్షన్ సభ్యులు షేక్.బీబా సాహెబ్, సురేష్, ఏఎంసీ చైర్మన్ బీడీకే.రత్నం, రైతుబంధు మండల కన్వీనర్ నాగేశ్వరరావు, జడ్పీటీసీ కనకదుర్గ, జడ్పీకోఆప్షన్ సభ్యుడు షేక్.లాల్‌మహ్మద్, చేపల సొసైటీ అధ్యక్షుడు షేక్.రహీం, మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్ అనిత, టౌన్‌ప్లానింగ్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.