Trial run: రహదారిపై రయ్ రయ్..!
ABN , First Publish Date - 2022-12-30T00:38:00+05:30 IST
దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ రహదారిపై విమానాలను దించేందుకు బాపట్ల జిల్లాలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది.

దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జాతీయ రహదారిపై విమానాలను దించేందుకు బాపట్ల జిల్లాలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై కొరిశపాడు- రేణంగివరం మధ్య నిర్మించిన అత్యవసర రన్‌వేపై గురువారం ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఏఎన్32 రవాణా విమానం, రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు, రెండు తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రన్‌వే పరీక్షల్లో పాల్గొన్నాయి. ఏఎన్32 రవాణా విమానం రన్‌వేపై 10-15 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. ఫైటర్ జెట్ల విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
- మేదరమెట్ల