Vijayananda Teertha: విశ్వశాంతి కోసం అనగాష్టమీ వ్రతాలు..
ABN , First Publish Date - 2022-12-15T13:54:34+05:30 IST
హనుమకొండ: విశ్వశాంతి కోసం హనుమకొండలో ఈనెల 16న అనగాష్టమీ వ్రతాలు నిర్వహిస్తున్నామని అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ తెలిపారు.

హనుమకొండ: విశ్వశాంతి కోసం హనుమకొండలో ఈనెల 16న అనగాష్టమీ వ్రతాలు నిర్వహిస్తున్నామని అవధూత దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ (Vijayananda Teertha Swamiji) తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 50వేల మంది వస్తున్నారని తెలిపారు. 16వ తేదీ సాయంత్రం 10,000 జంటలతో సామూహిక వ్రతాలు, భగవద్గీత పారాయణం నిర్వహిస్తామన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ (Ganapathi Satchidananda Swamiji) హాజరవుతారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విజయానంద తీర్థ స్వామి తెలిపారు.