Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:17 PM
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

జనగామ జల్లా: రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ (Congress) తెచ్చిన కరువు అని.. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు.. రైతులకు 24 గంటల కరెంట్ లేదని బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Ex Minister Errabelli Dayakar Rao) విమర్శించారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని.. ధర్నా వద్దు మూడు రోజులలో నీళ్లు ఇస్తామని అధికారులు ఫోన్ చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు పంట నష్టపరిహారం కింద పది వేలు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ అని అన్నారు. పంటలు ఎండిపోయిన తరవాత నీళ్లు ఇచ్చి ఎం లాభమని అన్నారు. రైతు కండ్లలో నీళ్ళు తప్ప ఆనందం లేదని, రైతులకు వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు మరొక్కసారి డిమాండ్ చేశారు.
Also Read..:
నన్ను కాపాడండి.. మనుబోలు శ్రీనివాసరావు
కాగా పార్టీ మారాలని ఎవరు ఒత్తిడి చేసినా మారేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను పోలీసులతో బెదిరించి ఇల్లు రాయించుకున్నానని శరణ్ చౌదరి అనే వ్యక్తి చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు.తనపై కేసులు పెట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందని అన్నారు. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News