కేయూలో పోస్టర్ల దుమారం

ABN , First Publish Date - 2022-11-18T23:38:13+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పోస్టుపై వర్సిటీలో దుమారం చెలరేగుతోంది. ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్‌ బి.వెంకట్రామిరెడ్డి స్థానంలో దూరవిద్య కేంద్రం (ఎస్‌డిఎల్‌సీఈ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసరావును ఇన్‌చార్జిగా నియమించడం వివాదానికి దారి తీసింది. ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ క్యాంప్‌సలో శుక్రవారం కేయూ విద్యార్థి సంఘాల పేరుతో పోస్టర్లు వెలిశాయి. ‘ఆంధ్రాకు చెందిన ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసరావును రిజిస్ట్రార్‌గా నియమించడం తెలంగాణ బిడ్డలకు అవమానకరం.. సిగ్గు సిగ్గు’ అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు.

కేయూలో పోస్టర్ల దుమారం
రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు

తెలంగాణ బిడ్డలు లేరా.. అని ప్రశ్న

కేయూలో పోస్టర్ల దుమారం

కేయూ క్యాంపస్‌, నవంబరు 18: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పోస్టుపై వర్సిటీలో దుమారం చెలరేగుతోంది. ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్‌ బి.వెంకట్రామిరెడ్డి స్థానంలో దూరవిద్య కేంద్రం (ఎస్‌డిఎల్‌సీఈ) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసరావును ఇన్‌చార్జిగా నియమించడం వివాదానికి దారి తీసింది. ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ క్యాంప్‌సలో శుక్రవారం కేయూ విద్యార్థి సంఘాల పేరుతో పోస్టర్లు వెలిశాయి. ‘ఆంధ్రాకు చెందిన ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసరావును రిజిస్ట్రార్‌గా నియమించడం తెలంగాణ బిడ్డలకు అవమానకరం.. సిగ్గు సిగ్గు’ అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. ‘ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధిస్తే, పదవులు మాత్రం ఆంధ్రావాళ్లకా..? అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు. క్యాంప్‌సలోని పోతన, స్కాలర్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌తో పాటు కామన్‌ మెస్‌, క్యాంటీన్‌, హుమనిటీస్‌ బిల్డింగ్‌, పరిపాలన భవనంతో పాటు ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కనిపించాయి. ‘రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనని వారికి పదవులు ఇచ్చారు.. రాష్ట్రోద్యమంలో పాల్గొన్న తెలంగాణ ప్రొఫెసర్లు రిజిస్ట్రార్‌ పోస్టుకు అర్హులు కారా? అని పోస్టర్లలో ప్రశ్నించారు. రిజిస్ట్రార్‌ నియామకమైన మరుసటి రోజే పోస్టర్లు వెలియడం వర్సిటీలో చర్చకు దారితీసింది.

ఇదిలావుండగా, వీసీ ప్రొఫెసర్‌ టి.రమేశ్‌ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా శ్రీనివాసరావును నియమించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వీసీ రమేశ్‌ వచ్చిన కొత్తలోనే మొదటగా ప్రొఫెసర్‌ బి.వెంకట్రామిరెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమించారు. తర్వాత అనూహ్యంగా కొద్దిరోజుల్లోనే ఆయన స్థానంలో ఇప్పటి యూజీసీ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డిని నియమించారు. మళ్లీ నెలరోజుల కాలంలోనే మల్లికార్జున్‌రెడ్డిని తొలగించి రిజిస్ట్రార్‌గా వెంకట్రామిరెడ్డిని నియమించారు. తాజాగా వెంకట్రామిరెడ్డి స్థానంలో, మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ టి.శ్రీనివాసరావును నియమించడంపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిపిస్తున్నాయి.

Updated Date - 2022-11-18T23:38:15+05:30 IST