అట్టహాసంగా నరకాసుర వధ

ABN , First Publish Date - 2022-10-24T00:23:53+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉర్సు గుట్ట ‘కుడా’ మైదానంలో ఆదివారం నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకల ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావ డంతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. 56అడుగుల నరకాసుర ప్రతిమ, బాణా సంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. ఉర్సు నరకాసుర వధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్‌, మేయర్‌ గుండు సుధారాణి, అడిష నల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌, భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభం కాగా, రాత్రి 9.40గంటలకు ఎమ్మెల్యే నరేందర్‌, మేయర్‌ సుధారణి చేతుల మీదుగా నరకాసుర ప్రతిమకు నిప్పంటించారు.

అట్టహాసంగా  నరకాసుర వధ

కరీమాబాద్‌, అక్టోబరు 23: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉర్సు గుట్ట ‘కుడా’ మైదానంలో ఆదివారం నరకాసుర వధ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వేడుకల ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావ డంతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. 56అడుగుల నరకాసుర ప్రతిమ, బాణా సంచా విన్యాసాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. ఉర్సు నరకాసుర వధ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్‌, మేయర్‌ గుండు సుధారాణి, అడిష నల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌, భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభం కాగా, రాత్రి 9.40గంటలకు ఎమ్మెల్యే నరేందర్‌, మేయర్‌ సుధారణి చేతుల మీదుగా నరకాసుర ప్రతిమకు నిప్పంటించారు. బాణాసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతిమ దగ్ధమవుతున్న సందర్భంలో విక్షలు కేరింతలు కొట్టారు. తమసెల్‌ ఫోన్లతో ఆ దృశ్యాలను బంధించారు. జనసందోహాన్ని దృష్టిలో౅ పట్టుకుని భారీ కేడ్లు, మహిళలకు షీ టాయిలెట్స్‌, అంబులెన్స్‌, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్‌ఇంజన్‌, మైదానంలో భారీ విద్యుత్‌ దీపాలు, భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. ఏసీపీ కలకోట గిరికుమార్‌ ఆధ్వర్యంలో ఇంతేజార్‌గంజ్‌, మట్టెవాడ, మిల్స్‌కాలనీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ జాం కాకుండా వాహనాలను మళ్లించారు. వేడులకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని పార్కింగ్‌ ప్రదేశంలో పెట్టేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు....

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ, సత్యభామల వేషధారణలో చిన్నారులు అలరించారు. ఉత్సవాలకు ముందు సాయంత్రం ఉర్సు ప్రతాప్‌నగర్‌ నుంచి భజనలతో, మేళతాళాలతో ఊరేగింపుగా రథం గుట్ట ప్రాంతానికి చేరుకుంది. అనంతరం ఉర్సు గుట్ట వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక అకట్టుకున్నాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రం ఓరుగల్లు: ఎమ్మెల్యే

సంస్కృృతి, సంప్రదాయాలు, కళలకు నిలయం ఓరుగల్లు అని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కళాకారులకు ఓరుగల్లు నిలయమని, అందేకే ఉర్సు గుట్ట ప్రాంతంలోని ఎకరం స్థలంలో కల్చరల్‌ ఆడిటోరియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలకు పోటీగా ఈ నరకాసుర ఉత్సవం వైభవంగా నిర్వహించడం సంతోషించదగిన విషయమన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపొతుందని, జిల్లాకు కలెక్టర్‌ భవనం, నూతన బస్టాండు నిర్మాణానికి ఏర్పాట్లు, మెడికల్‌ కళాశాల, సూపర్‌స్పెషాలిటీ హస్పిటల్‌ను సాధించుకున్నట్లు తెలిపారు.

దుష్టశిక్షణకు నిదర్శనం దీపావళి: మేయర్‌

మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ దుష్టశిక్షణకు నిదర్శనం దీపావళి అని, ప్రతీ వ్యక్తి పురణగాధలను తెలుసుకోవాలని సూచించారు. ఇటీవలే దసరా ఉత్సవాలు నిర్వహించుకున్నాక దీపావళికి నరకాసుర వధ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, ప్రధాన కార్యదర్శి శతపతి శ్యామలరావు, కోశాధికారి కనుకుంట్ల రవి, మహిళా విఽభాగం ప్రతినిధి మరుపల్ల భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షుడు వనం మధు, సహాయ కార్యదర్శులు రామ్మూర్తి, సాంబమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శులు వనం కుమార్‌, ఆవునూరి రామన్న, ప్రచార కార్యదర్శి మరుపల్ల గౌతం, ఆర్గనైజర్స్‌ మాటేటి శ్యాం, వంగరి సురేష్‌, మిర్యాల ఆదిత్య, నాగవెల్లి రంజిత్‌, గౌడ రాము, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-24T00:23:56+05:30 IST