ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ 2 అనుసంధాన పనులు పూర్తి
ABN , First Publish Date - 2023-02-08T00:56:28+05:30 IST
నేడు షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 7: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్ నుంచి 10వ తేది ప్రయోగించనున్న ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ 2 రాకెట్ ప్రయోగానికి సంబంధించి అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఘన ఇంధన అనుసంధాన భవనం నుంచి మొదటి ప్రయోగ వేదికకు మూడు రోజుల కిత్రం రాకెట్‌ను తరలించారు. ప్రయోగ వేదిక వద్ద అనుసంధాన పనులను పూర్తి చేసి తుది పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) బుధవారం షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలందరూ సమావేశమై చర్చించనున్నారు.అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్) సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-07తో పాటు మరో చిన్న ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 10న ఉదయం 9:18గంటలకు షార్‌లోని ప్రధమ వేదిక నుంచి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ 2 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.