Harsha Kumar: వైసీపీ ప్రభుత్వంలో దోపిడీపై హర్షకుమార్ విమర్శలు
ABN , First Publish Date - 2023-08-19T17:13:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్నా వాళ్లకి పరిష్కారం దొరకడం లేదు. ఎస్సీ కమిషన్ ఎందుకుంది.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్నా వాళ్లకి పరిష్కారం దొరకడం లేదు. ఎస్సీ కమిషన్ ఎందుకుంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అంశాలపైన సుమారుగా ఒక గంట పాటు ఎస్సీ కమిషన్‌తో చర్చలు జరిపాం. రాష్ట్రంలో నేషనల్ ఎస్సీ కమిషన్ టీం పర్యటించింది. పర్యావరణ సెక్రటరీని కూడా కలిశాను.
రాష్ట్రంలో కొండలను తవ్వడం, మట్టి, రాయిని అమ్ముకోవడం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా కొండలను దోచుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా కొంతమేర జరిగాయి. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యధెచ్ఛగా రాష్ట్రం మొత్తం ఎక్కడ కొండలు ఉన్నాయో అక్కడ పూర్తిగా దోచుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండలో పర్యటించారు. రియల్ ఎస్టేట్ వారి ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ సెక్రటరీని కోరాను." అని హర్షకుమార్ అన్నారు.