Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం

ABN , First Publish Date - 2023-09-29T18:58:02+05:30 IST

అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణాజిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పిలుపునిచ్చారు.

Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం

విజయవాడ: అక్టోబర్ ఒకటి నుంచి కృష్ణాజిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందని.. పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఆదివారం సాయంత్రం అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. జనసేన - తెలుగుదేశం - బీజేపీ కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుంది. ఈ యాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం. 151 స్థానాలు ఇస్తే ఈ ప్రభుత్వం కక్షతో పాలన చేస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్టు రాజకీయ కక్షతో చేసిందే. అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాశనం చేశాడు. ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుంది.

సోషల్ మీడియా వేదికగా మా పొత్తులపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. అలాం పోస్ట్‌లు, వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దు. మన పొత్తులు పదవుల‌ కోసం కాదు.. రాష్ట్రం, ప్రజల క్షేమం కోసం. వైసీపీలో మంత్రులతో సహా ప్రతిపక్షాలను బూతులు తిట్టినా కేసులు ఉండవు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే మాత్రం కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేస్తున్నారు. ఇలాంటి నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడాలి. త్వరలోనే మన ప్రజా ప్రభుత్వం వస్తుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T18:58:02+05:30 IST