Alapati raja: సుప్రీం చెప్పినా ఏపీలో ఇసుక రవాణా ఆగలేదు
ABN , First Publish Date - 2023-07-21T14:46:31+05:30 IST
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఇసుక తవ్వకాల వల్ల రైతుల భూములు కోతలకు గురవుతున్నాయి. రైతులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం ఇసుక తవ్వకాలు ఆపడం లేదు.

గుంటూరు: ఇసుక తవ్వకాలు ఆపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా (Alapati raja) అన్నారు. తెనాలి సబ్ కలెక్టర్‌ను ఆలపాటి రాజా కలిసి అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. కొల్లిపర మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో (AP) విచిత్రమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఇసుక తవ్వకాల వల్ల రైతుల భూములు కోతలకు గురవుతున్నాయి. రైతులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. రాష్ట్రంలో ఇసుక మాఫియా విలయ తాండవం చేస్తుంది. ఇసుక అక్రమ రవాణా ఆపాలని చెప్పినా ఎక్కడా ఆపిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాలు యధేచ్చగా తొవ్వుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రజా భక్షకులుగా తయారు అయ్యారు.’’ అని ధ్వజమెత్తారు.