నకిలీ ఎన్‌ఓసీ పత్రాల కేసులో.. నలుగురు అరెస్టు
ABN , First Publish Date - 2023-09-26T23:27:49+05:30 IST
నకిలీ ఎన్‌ఓసీ, ఫోర్జరీ కేసులో రియల్టర్ శ్రీపతి శ్రీనివాసులు, వీఆర్వో గూడూరు కలానందరెడ్డి, సర్వేయర్లు అంకిరెడ్డిపల్లె సందీప్‌రెడ్డి, చీపాటి వాసుదేవ రెడ్డిలను అరెస్టు చేశామని సీఐ రాజు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

నిందితులలో రియల్టర్, ముగ్గురు రెవెన్యూ సిబ్బంది
పులివెందులటౌన్, సెప్టెంబరు 26: నకిలీ ఎన్‌ఓసీ, ఫోర్జరీ కేసులో రియల్టర్ శ్రీపతి శ్రీనివాసులు, వీఆర్వో గూడూరు కలానందరెడ్డి, సర్వేయర్లు అంకిరెడ్డిపల్లె సందీప్‌రెడ్డి, చీపాటి వాసుదేవ రెడ్డిలను అరెస్టు చేశామని సీఐ రాజు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ మాట్లాడుతూ పై నిందితులు నలుగురూ సులభపద్ధతిలో డబ్బులు అధికంగా సంపాదించాలనుకున్నారు. ఈ మేరకు పులివెం దుల టౌన్‌లోని డీకేటీ మరియు చుక్కల భూము లను గుర్తించి సంబంధిత యజమానుల వద్దకెళ్లి ఎన్‌ఓసీ తెప్పిస్తాము తద్వారా భూములు రిజిస్టర్ చేసుకుంటే మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ము కోవచ్చు అని చెప్పారు. అలా 99/2, 99/1, 2/2ఏ, 135/3, 45/2, 13/2, 58/2, 98/1ఏ, 48/2 సర్వేనెబర్లలో 30 ఎకరాలకు సంబంధించి ఆ భూముల యజమానుల నుంచి లక్షల రూపా యలు వసూలు చేసి వారికి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ ఎన్‌ఓసీ పత్రాలను సృష్టించారు. ఆ ఎన్‌ఓసీలనే నిజమైన పత్రాలుగా నమ్మించి రిజిస్టర్ చేయించి అధిక మొత్తంలో డబ్బులు వసూలుచేసి మోసానికి పాల్పడ్డారు.
ఈనెల 24వ తేదీన ఊటుకూరు విద్యానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రియల్టర్ శ్రీపతి శ్రీనివాసులును ఇంటి వద్ద మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అలాగే కోర్టు సర్కిల్ వద్ద సాయంకాలం కళానందరెడ్డి, సందీప్‌రెడ్డి, వాసు దేవరెడ్డిలను ఎస్‌ఐ సత్యనారా యణ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరిపై క్రైం నెంబర్ 430/2023 యు/ఎస్ 420, 468, 471 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కంప్యూటర్ సీపీయూ, ప్రింటర్, ఇతర కంప్యూటర్ వస్తువు లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వైద్య పరీ క్షల అనంతరం నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తా మన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సత్య నారాయణ, ఏఎస్‌ఐ స్వామి పాల్గొన్నారు.