వైసీపీకి గుణపాఠం తప్పదు: టీడీపీ
ABN , First Publish Date - 2023-09-22T23:41:07+05:30 IST
వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో వైసీపీకి గుణపాఠం తప్పదని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

డోన్, సెప్టెంబరు 22: వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో వైసీపీకి గుణపాఠం తప్పదని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో బాబుతో మేము నిరాహార దీక్ష చేపట్టారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ పోరాటం చేశారన్నారు. జనంలో చంద్రబాబు తిరగకూడదనే వైసీపీ కుట్రలు చేసి అక్రమ కేసుల్లో ఆయన్ను ఇరికించిందని మండిపడ్డారు. అవినీతి బురదలో సీఎం జగన్ ఉన్నారని, అది చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. వైసీపీ నాయకులు అక్రమ ఆదాయాల కోసం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డోన్ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు నింపడానికి టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేస్తే చెరువులకు జలకళ తెచ్చామని మంత్రి బుగ్గన డబ్బా కొట్టుకోవడం సిగ్గు చేటన్నారు. చర్చకు రమ్మని టీడీపీ సవాల్ విసిరితే.. మంత్రి బుగ్గన సమాధానం చెప్పకుండా వైసీపీ నాయకులతో తప్పుడు మాటలు మాట్లాడించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పార్టీ పట్టణ అద్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులుయాదవ్, దేవర బండ వెంకటనారాయణ, ప్యాపిలి మండల అద్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, మిద్దెపల్లి గోవిందు, జయన్న యాదవ్, శంకర్‌గౌడు, సర్పంచ్ రామిరెడ్డి, పరమేశ్వరప్ప, రంగస్వామి, జయరాముడు, సుధాకర్, మద్దిలేటి, నారాయణ పాల్గొన్నారు.
శిరివెళ్ల: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన విడుదలయ్యేంత వరకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీపీ, మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ ఎదుట మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు శిరివెళ్ల మండలం నుంచి టీడీపీ శ్రేణులు, భూమా అభిమానులు శుక్రవారం భారీగా తరలివెళ్లారు. మండల ప్రధాన కార్యదర్శి మురళి, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, మాజీ ఎంపీటీసీ కొండబోయిన బాలచంద్రుడు, నాయకులు సూరా రామ, కుందూరు మోహన్‌రెడ్డి, తిరుమల రవి, అన్నెం విజయ భాస్కర్‌రెడ్డి, మెట్ల భాస్కర్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రవరం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబును కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారని టీడీపీ మండల నాయకులు బాచుపలె ్లవెంకట నారాయణ, ఎల్‌వీ రంగనాయకులు, రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు రుద్రవరం మండల నాయకులు మద్దతు పలికారు. మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు, యల్లావత్తుల సర్పంచ్ చంద్రమోహన్, యడవలి శ్రీనివాసులు, యువరాజు, నరసాపురం శ్రీనివాసులు, బండారు బాలరాజు, పెద్దఫక్కీరా ఉన్నారు.
దొర్నిపాడు: ఓటమి భయంతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండల టీడీపీ నాయకులు సిద్ధి సత్యం, లింగుట్ల వెంకట్‌నాయుడు అన్నారు. నంద్యాలలో ఆర్‌కే ఫంక్షన్ హాల్ వద్ద దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మద్దతుగా దొర్నిపాడు, చాకరాజువేముల గ్రామాల టీడీపీ నాయకులు తరలివెళ్లి సంఘీభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమరసాని రవికుమార్, నాగేంద్ర, ఈడిగ లక్ష్మీనారాయణ, బాలిరెడ్డి, జిల్లా సుబ్బన్న, మాజీ సర్పంచ్‌లు కానాల దస్తగిరి, నాగన్న తదితరులు ఉన్నారు.
బనగానపల్లె: చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బనగానపల్లె పట్టణంలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భూషన్న ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీసీ నాయకులు నిరనన దీక్షలో పాల్గొన్నారు. . చంద్రబాబునాయుడును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని నినాదాలు చేశారు. త్వరగా చంద్రబాబు విడుదల చేయాలని నినాదాలు చేశారు. రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేశారని బీసీ నాయకులు విమర్శించారు. దీక్షలో మండల టీడీపీ బీసీ టీడీపీ నాయకులు యాగంటిపల్లె దస్తగిరి, బాలనాయుడు, రంగస్వామి, బాలకృష్ణ, బాలరాజు, పెండేకంటి బాలసుబ్బయ్య, మంగంపేట శ్రీనివాసులు, పలుకూరు వల్లెపుశంకర్, నందివర్గం ఉమామహేశ్వరరావు, గొల్లకంబగిరి, వేముల పాడు గురప్ప, నరసింహులు, సాధుకొట్టంరామశేఖర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి బొబ్బల గోపాల్‌రెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టీచర్ ఫక్కీరరెడ్డి, ఆర్‌సీ నాగిరెడ్డి, మౌళీశ్వరరెడ్డి, అమర్‌నాథరెడ్డి, శంఖేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణా నాయక్, సలాం, ఖాదర్‌తో పాటు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించి దీక్షను విరమింపజేశారు.