Nara Lokesh: జగన్ మాటలను వింటే బిల్డప్ బాబాయి గుర్తొస్తారు
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:42 PM
అయ్యో... జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారన్నారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటదని విమర్శించారు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయిందన్నారు.

అమరావతి : అయ్యో... జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారన్నారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటదని విమర్శించారు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయిందన్నారు. రూ.15వేలకోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయిందని నారా లోకేష్ అన్నారు. దీంతో జేఎస్‌డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడన్నారు. మరో మూడు నెలల్లో పదవీ కాలం పూర్తి కావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడన్నారు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.