YCP: ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ నేత సవాల్
ABN , First Publish Date - 2023-03-29T19:10:23+05:30 IST
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి (Anam Ramanarayana Reddy) వైసీపీ (YCP) నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (Nedurumalli Ramkumar Reddy) సవాల్ విసిరారు.
నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి (Anam Ramanarayana Reddy) వైసీపీ (YCP) నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (Nedurumalli Ramkumar Reddy) సవాల్ విసిరారు. ‘‘ఆనం ఈమధ్య కొత్తగా ఓమాట చెబుతున్నారు. పార్టీ సిద్ధాంతాల గురుంచి, ఆత్మప్రభోదంసారం అంటున్నారు. నీకు ఏ పార్టీ సిద్ధాంతం నచ్చుతుందో ఆ పార్టీలో చేరి వెంకటగిరి నుండి పోటి చెయ్యి, నేను వైసీపీ నుంచి పోటీ చేస్తా. ఎవరి స్థాయి ఏమిటో తెలుస్తుంది.’’ అని ఆయన సవాల్ విసిరారు. ఆత్మప్రభోదంసారం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నీకు ఓటు వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఆనం చేసిన అన్యాయాలు, అక్రమాలకి ఎంత మంది బలయ్యారో అందరికీ తెలుసని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు.
ఇదిలావుండగా.. రహస్య ఓటింగ్‌లో ఎవరికి ఓటేసిందీ ఎవరికీ తెలియదని.. అయినా నలుగురు ఎమ్మెల్యేలను ఈ ఆరోపణపై తొలగించడం సిగ్గుచేటని వైసీపీ నుంచి సస్పెండైన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. తనపై చేసిన క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్తానని చెప్పారు. జవాబుదారీ ఉన్న ఏ పార్టీ కూడా ఇలా చేయదని.. విలువలు లేని పార్టీలే ఇలా చేస్తాయని విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని ప్రశ్నించారు. తన ఓటును కొనుగోలు చేయగలిగిన శక్తి ఎవరికీ లేదన్నారు. ‘ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కోవడానికి.. కుటుంబ సభ్యులను హత్య చేయించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించడానికి కాదు’ అని పరోక్షంగా సీఎం జగన్‌నుద్దేశించి విమర్శలు చేశారు.