Share News

IPL-2025: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్లు నిషేధం.. మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Mar 21 , 2025 | 08:31 PM

వేలంలో కొనుగోలు చేసిన తర్వాత టోర్నీ నుంచి వైదొలగడం బ్రూక్‌కు వరుసగా ఇది రెండోసారి. దీంతో బీసీసీఐ అతడిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. బ్రూక్‌ను రెండు సీజన్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించాడు.

IPL-2025: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్లు నిషేధం.. మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందన ఏంటంటే..
BCCI bans Harry Brook

ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్‌ (Harry Brook)ను ఐపీఎల్-2025 (IPL-2025) మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు కొనుగోలు చేసింది. అతడిని 6.25 కోట్లకు దక్కించుకుంది. అయితే బ్రూక్ మాత్రం చివరి నిమిషంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చాడు. ఈ సీజన్‌ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. వేలంలో కొనుగోలు చేసిన తర్వాత టోర్నీ నుంచి వైదొలగడం బ్రూక్‌కు వరుసగా ఇది రెండోసారి. దీంతో బీసీసీఐ (BCCI) అతడిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. బ్రూక్‌ను రెండు సీజన్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేధించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించాడు (BCCI bans Harry Brook).


హ్యారీ బ్రూక్‌ను రెండేళ్ల పాటు నిషేధించాలన్న బీసీసీఐ నిర్ణయం సహేతుకమైనదేనని మైకేల్ వాన్ (Michael Vaughan) వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లు చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్రాంఛైజీల ప్రణాళికలు తారమారవుతాయని వ్యాఖ్యానించాడు. రూల్స్ ఎవరికైనా ఒకటేనని, ఐపీఎల్ వేలంలో పాల్గొనడానికి బ్రూక్ తన పేరును ఇచ్చాడని, చివరి నిమిషంలో వైదొలగాలని నిర్ణయించుకున్నాడని వాన్ చెప్పాడు. బ్రూక్ ఎలాంటి గాయానికీ గురి కాలేదని, ఇంగ్లండ్‌లో ఉండిపోవాలనుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని వాన్ చెప్పాడు.


త్వరలో ఇంగ్లండ్ వన్డే జట్టుకు బ్రూక్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని, అది ఇంగ్లండ్ అభిమానులకు శుభవార్తే అవుతుందని, అయితే ముందుగానే ఆ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీకి చెపి ఉండాల్సిందని ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వాన్ పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించాలనే కోరిక చాలా గొప్పదని, అయితే ఆ విషయాన్ని ముందుగానే ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెప్పి ఉండాల్సిందని అన్నాడు. ఏదేమైనా బ్రూక్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని వాన్ అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి..

Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధన శ్రీ మూడేళ్ల క్రితమే విడిపోయారా.. డైవర్స్ పిటిషన్‌లో ఏముందంటే..


ఎస్ఆర్‌హెచ్ మ్యాచుల టికెట్స్ బుక్ చేసుకోండిలా..

హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 08:31 PM