Chiranjeevi: లండన్ పర్యటనలో చిరు.. వారిపై ఫైర్
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:48 PM
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లండన్ వెళ్లారు. అక్కడ ప్యాన్ మీట్ పేరిట నగదు వసూల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

హైదరాబాద్, మార్చి 21: మెగాస్టార్ చిరంజీవి తాజాగా లండన్‌లోని యూకే పార్లమెంట్‌లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అయితే ఆయన లండన్ టూర్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో మెగాస్టార్ ఫ్యాన్ మీట్ పేరుతో నగదు వసూల్ చేశారు. ఈ వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో తన ఎక్స్ ఖాతా వేదికగా చిరంజీవి స్పందించారు.
'ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, అభిమానం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా నగదు వసూల్ చేస్తే.. వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా, స్వలాభంకు దూరంగా ఉంచుదామని చిరంజీవి పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలపాటు సినీ రంగానికి చేసిన సేవకు గాను మెగా స్టార్ చిరంజీవిని బ్రిటన్ పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. బ్రిటన్‌లోని అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీన్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు చిరంజీవి సరసన హీరోయిన్‌గా త్రిష నటిస్తున్న విశ్వంభర మరి కొద్ది నెలల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
Anchor Shyamala: శ్యామలకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు..
కొత్తిమీర రసం తాగితే ఇన్ని లాభాలా..?
Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్
Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
For Telangna News And Telugu News