పార్టీలకతీతంగా ఇళ్ల స్థలాల మంజూరు
ABN , First Publish Date - 2023-07-03T22:13:59+05:30 IST
పార్టీలకతీతంగా ప్రభుత్వం పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. అల్లూరులోని దయాకర్‌రెడ్డి లేఅవుట్‌లో సోమవారం పలువురికి ఇళ్ల పట్టాలను ఆయన అందచేశారు. ముందుగా

అల్లూరు, జూలై 3 : పార్టీలకతీతంగా ప్రభుత్వం పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. అల్లూరులోని దయాకర్‌రెడ్డి లేఅవుట్‌లో సోమవారం పలువురికి ఇళ్ల పట్టాలను ఆయన అందచేశారు. ముందుగా వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇళ్లను ఇచ్చిందన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డీ శశిరేఖ, జడ్పీటీసీ వేణమ్మ, నాయకులు దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్, ఊటు శ్రీకాంత్‌రెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యం, సాధిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.