Share News

పాలిసెట్‌ 2025

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:36 AM

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి మే 13న నిర్వహించే ఎంట్రెన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఇంజనీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరహాలోనే రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ సీట్లన్నీ స్థానిక విద్యార్థులకు...

పాలిసెట్‌ 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించి పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

తెలంగాణ సెట్‌

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి మే 13న నిర్వహించే ఎంట్రెన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఇంజనీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరహాలోనే రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ సీట్లన్నీ స్థానిక విద్యార్థులకు కేటాయించనున్నారు. మొత్తం సీట్లన్నీ కన్వీనర్‌ సీట్లు మాత్రమే. 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం స్థానికేతరులకు కేటాయించారు. అంటే నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఏడేళ్లలో నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికులుగా పరిగణిస్తారు. స్థానికేతర కోటా అంటే పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలు, తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.

ఫీజు : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.250/-, ఇతరులకు రూ.500/-

చివరి తేదీ: 2025 ఏప్రిల్‌ 19 (రూ.100/- ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 21, రూ.300/- ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష: 2025 మే 13

ఫలితాలు : 2025 జూన్‌

వెబ్‌సైట్‌ : https:// polycet.sbtet.telangana.gov.in/


ఏపీ సెట్‌

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏపీ పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి అర్హత ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష మాత్రం ఆఫ్‌లైన్‌ మోడ్‌లో జరుగుతుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్న పత్రం మొత్తం 120 మార్కులకు ఉంటుంది. రెండు గంటల్లో దీనికి సమాధానాలు గుర్తించాలి. లెక్కల్లో 50 ప్రశ్నలు, ఫిజిక్స్‌లో 40 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 30 ప్రశ్నలు ఉంటాయి.

ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400/-

ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రూ.100/-

చివరి తేదీ: 2025 ఏప్రిల్‌ 15

ప్రవేశ పరీక్ష : 2025 ఏప్రిల్‌ 30

ఫలితాలు : 2025 మే 10(ఉజ్జాయింపు తేదీ)

వయస్సు : ఎలాంటి వయోపరిమితి లేదు.

వెబ్‌సైట్‌ : https://polycetap.nic.in/

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:37 AM