కావలి అభివృద్ధి మండలి ఎక్కడ ఎమ్మెల్యే గారూ...!?

ABN , First Publish Date - 2023-09-21T21:45:25+05:30 IST

కావలి అభివృద్ధి మండలి ఎక్కడ ఎమ్మెల్యే గారూ... ? అని జనసేన నేత సిదుఽ్ధ ప్రశ్నించారు. గురువారం వైకుంఠపురం వద్ద జనసేన నేత సిద్దు నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు

కావలి అభివృద్ధి మండలి ఎక్కడ ఎమ్మెల్యే గారూ...!?
21కెవిఎల్‌ 4: ఆందోళన చేస్తున్న జనసేన నాయకులు

కావలిటౌన్‌, సెప్టెంబరు21: కావలి అభివృద్ధి మండలి ఎక్కడ ఎమ్మెల్యే గారూ... ? అని జనసేన నేత సిదుఽ్ధ ప్రశ్నించారు. గురువారం వైకుంఠపురం వద్ద జనసేన నేత సిద్దు నాయకత్వంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఏడు అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చేస్తామని, ఫ్లెక్సీలు వేయించి చేసిన హడావుడి ఏమైందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, అవినీతి రికార్డుస్థాయిలో ఉందన్నారు. 24 గంటలు గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుపతిస్వామి, చంటి, విజయ్‌, నాయబ్‌, పుల్లయ్య, సన్నీ, చిన్నా, సాయి తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - 2023-09-21T21:45:25+05:30 IST