Share News

Kakani: ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:09 AM

అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kakani: ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి
Kakanani Govardhan Reddy

నెల్లూరు: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakanani Govardhan Reddy) ఇంకా పరారీలోనే ఉన్నారు. పదిరోజులుగా పోలీసుల (Police) నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. కాకాణిని అరెస్ట్ చేయడంలో‌ పోలీసులు ఘోరవైఫల్యం చెందారు. ఫిబ్రవరి 16న కేసు నమోదైనా, పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు హడావిడి చేస్తూ కాకాణి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదు (Hyderabad) , బెంగళూరు (Bengaluru), చెన్నై (Chennai), ముంబాయి (Mumbai)లలోనూ కాకాణి కోసం ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పోలీసు అధికారులను కాకాణి బెదిరింపు ధోరణితో తీవ్రస్థాయిలో దూషించారు. దీంతో ఆయనకు భయపడే పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే చర్చలు జరుగుతున్నాయి. కాగా సోమవారం హైకోర్టులో కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటీషన్లపై విచారణ కొనసాగనుంది.

Also Read..: సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..


కాగా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. అక్రమమైనింగ్ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతీసారి కాకాణి మాత్రం తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. దీంతో పోలీసులు ఆయన బంధువులకు నోటీసులు ఇస్తున్నారు.

ఇటీవల కాకాణి హైదరాబాద్‌లో ఉన్నారని పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కాకాణి నివాసంలో ఓ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న ఆయన.. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి జంప్ అయ్యారు. తీరా అక్కడకు వెళ్లిన పోలీసులు నిరాశే ఎదురైంది. కాకాణి లేడని తెలుసుకున్న పోలీసులు అక్కడ ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. అక్రమ మైనింగ్‌ కేసులో ఏప్రిల్‌ 3న (గురువారం) నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసారి కచ్చితంగా విచారణ రావాలని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మూడో సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.


మూడవ సారి కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి. పోలీసుల విచారణకు అస్సలు సహకరించకుండా కాకాణి హైడ్రామా ఆడుతున్న పరిస్థితి. ఇటీవల పోలీసు అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించి, దూషించారు కాకాణి. గతంలోనూ ఓ కేసులో ఇదే తరాహాలో కాకాణి హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యింది. పరారీలో ఉంటూనే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాకాణి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పోలీసుల నుంచి తప్పించుకుని బెయిల్ తెచ్చుకునేందుకు కాకాణి విశ్వ ప్రయత్నం చేస్తుండగా.. ఎలాగైన కాకాణిని విచారించాలని పోలీసులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Ad

Updated Date - Apr 07 , 2025 | 07:09 AM