వడదెబ్బతో మేకల కాపరి మృతి
ABN , First Publish Date - 2023-04-15T21:47:35+05:30 IST
మండలంలోని పెద్దమాచునూరులో శనివారం వడదెబ్బతో మేకల కాపరి బాలయ్య(38) మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు, బాలయ్య

మర్రిపాడు, ఏప్రిల్ 15 : మండలంలోని పెద్దమాచునూరులో శనివారం వడదెబ్బతో మేకల కాపరి బాలయ్య(38) మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు, బాలయ్య మేకలను కాసుకుంటూ భార్య, ముగ్గరు పిల్లలను పోషించుకునేవాడు. రోజూ మాదిరిగానే శనివారం కూడా మేకలను మేపుకునేందుకు వెళ్లి ఆరోగ్యం సహకరించకపోవడంతో మధ్యాహ్ననికే ఇంటికి వచ్చారు. సేదతీరేందుకు మంచం మీద పడుకున్న కాసేపటికే వడదెబ్బతో మృతి చందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-----------