Raghurama Krishnaraju : అంబటి గురించి బ్రో మూవీలో మంచి మాటలున్నాయి
ABN , First Publish Date - 2023-07-29T14:07:22+05:30 IST
తమ పార్టీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు.
ఢిల్లీ : తమ పార్టీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి బ్రో సినిమాలో మంచి మంచి మాటలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఎంత సంపాదించినా పోవాల్సిందే అనే అంశాన్ని చెప్పారన్నారు. మార్గదర్శి పై పైశాచిక దాడిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడన్నారు. ఎవరు పిర్యాదు చేయకపోయినా మార్గదర్శి పై కేసు నమోదు చేశారని రఘురామ తెలిపారు. మరి ఇన్ని కంపెనీలు పెట్టిన సాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి.. తండ్రి అధికారంలోకి రాగానే అల్లా ఉద్ధిన్ అద్భుత దీపం అయ్యినట్టు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. రాజమండ్రిలో వైసీపీ రాజకీయ నాయకులు ఆవ భూముల్లో 150 కోట్లు మింగేశారన్నారు.
వరదల్లో ఆవ భూములు పూర్తిగా మునిగిపోయాయన్నారు. పోలీసులు మీ ఉద్యోగాన్ని నిర్వహించాలని తెలిపారు. దయచేసి రాజకీయ నాయకులు చెప్పినవి చేయకండని రఘురామ పేర్కొన్నారు. న్యాయవాది శ్రవణ్ కుమార్ జగన్ సభలకు పిల్లలను తీసుకెళ్లడంపై కేసు వేశారన్నారు. శుభ పరిణామం విద్యాశాఖ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేశారన్నారు. బొత్స సత్యనరాయణ మాటలు సరైన విధంగా లేవన్నారు. కోర్టులో కేసు ఉంటే మీటింగ్ పిల్లలు రాకపోతే సినిమా వాళ్లు వస్తారా? అని మాట్లాడుతున్నారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అలా చేయడం ఎందుకని రఘురామ ప్రశ్నించారు.