TDP: జంగారెడ్డిగూడెంలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-04-05T20:24:52+05:30 IST

జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ (TDP) అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు

TDP: జంగారెడ్డిగూడెంలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పశ్చిమగోదావరి: జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ (TDP) అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఏలూరురోడ్డులో గల ఆయన విగ్రహానికి ముఖ్య అతిధులు గోపాలాపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరావుగారు, మరియు చింతలపూడి నియోజకవర్గ నాయకులు బొమ్మాజీ అనీల్ పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముప్పిడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన నిత్యకృషివలుడు, మూడు దశాబ్దాలపాటు కేంద్రమంత్రిగా విశేష సేవలందించిన తొలి దళిత ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ అన్నారు.

అలాగే బొమ్మాజి అనీల్ మాట్లాడుతూ... బలహీనుల హక్కుల కోసం రాజ్యాంగం కల్పించిన సిద్ధాంతాల కోసం బడుగుల పక్షాన నిలిచిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. 1986 వరకు ఏకధాటిగా 50 ఏళ్ల పాటు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కొనసాగి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్‌కే దక్కిందని పేర్కొన్నారు.

బీసీ సెల్ రాష్ట్రకార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు మాట్లాడుతూ.. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీకాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, ఉడతనేని మధు, వెలిచేటి నాగేశ్వరావు, కొంచాడ ప్రసాద్, మీనా శ్రీను,పట్టణ అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, మన్యం దుర్గారావు, మల్లిపూడి నవీన్, చిట్టిబోయిన ఆంజనేయులు, కాశాని శ్రీనివాస్,కొమ్మిరెడ్డి సోమరాజు మరియూ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Updated Date - 2023-04-05T20:28:58+05:30 IST