గురు పౌర్ణమి
ABN , First Publish Date - 2023-07-03T23:59:20+05:30 IST
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం షిరిడీ సాయి మందిరాలు, ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వ హించారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఏలూరు కార్పొరేషన్, జూలై 3: గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం షిరిడీ సాయి మందిరాలు, ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వ హించారు. నగరంలోని పలు ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, సామూ హిక సత్యవ్రతాలు నిర్వహించారు. ఆదివారపుపేటలో రథంపై బాబాను ఊరేగించారు. పాత బస్టాండ్ సెంటర్‌లోని పాండురంగ స్వామి ఆలయ ప్రాంగణంలో బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గులాబీ తోటలోని షిరిడీ సాయినాఽథుడికి నిర్వాహకులు 125 రకాలు పిండి వంటలతో నివేదన సమర్పించారు. ఆదివారపుపేట షిరిడీ సాయి ప్రేమ మందిర్‌లో భక్తులు ధర్మకర్త, టీడీపీ నాయకులు ఇసుకపల్లి తాతారావును దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. భారీ సంఖ్యలో మహిళలు సామూహిక సత్యవ్రతా లు జరిపారు. బావిశెట్టివారిపేటలో షిరిడీ సాయినాథుడికి ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రత్యేక పూజలు చేశారు. రామచంద్రరావుపేట, పత్తేబాద, పన్నెండు పంపుల సెంటర్, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో గల షిరిడీ సాయి మంది రాల వద్ద గురుపౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు.
పెదవేగి: మండలంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలా డాయి. రాట్నాలకుంట సాయిబాబా ఆలయంలో సామూహిక సాయి సత్య వ్రతాలు నిర్వహించారు. అర్చకుడు చావలి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి సత్యవ్రతాల్లో రాట్నాలకుంట, రాయన్నపాలెం, కొండల రావుపాలెం గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, సప్పా మోహన్ మురళి తదితరులు పాల్గొన్నారు.