సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి కృషి

ABN , First Publish Date - 2023-05-08T00:21:45+05:30 IST

నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సింథ టిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి కృషి చేస్తానని శాప్‌ ఎండీ కె.హర్షవర్ధన్‌ అన్నారు.

సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి కృషి
శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు

ఏలూరు స్పోర్ట్స్‌, మే 7: నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సింథ టిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి కృషి చేస్తానని శాప్‌ ఎండీ కె.హర్షవర్ధన్‌ అన్నారు. స్థానిక గులాబీతోటలో షోటోకాన్‌ కరాటే, కుమితి, కొబుడో విభాగంలో ఆదివారం సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడు తూ, రాష్ట్ర వ్యాప్తంగా వేసవిలో 1300 పైగా వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడి యంలో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారని, ట్రాక్‌ నిర్మాణానికి చిత్తశుద్ధ్దితో కృషి చేస్తానని, క్రీడాకారులకు జీవో 72 ద్వారా ఉద్యోగావకాశాలపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అధిక ప్రోత్సాహం ఇస్తుందన్నారు. సెట్వెల్‌ సీఈవో ఎండిహెచ్‌ మెహర్రాజ్‌, డీఎస్‌ఎ చీఫ్‌కోచ్‌ డి.శ్రీనివాసరావు, ఏపీ షోటోకాన్‌ కరాటే సెక్రటరీ నాగం శివ, షోటోకాన్‌ కరాటే నిర్వాహకులు ఎండి ఇబ్రహీం బేగ్‌, కెఎల్‌. నారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-08T00:21:45+05:30 IST