Credit Card: అమల్లోకి కొత్త రూల్.. క్రెడిట్ కార్డులకు ఇప్పటిదాకా ఉన్న ఈ ఫెసిలిటీ.. ఇకపై అస్సలు ఉండదట..!
ABN , First Publish Date - 2023-09-20T10:36:23+05:30 IST
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.
ప్రపంచమంతా ఇప్పుడు నగదు రహిత లావాదేవిలు జరగుతున్నాయి. ముఖ్యంగా షాపింగ్ కు వెళ్లినప్పుడు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు చాలా ఉపయోగపడతాయి. క్రెడిట్ కార్డుల సహాయంతో మొదట కావలసిన అవసరాలు తీర్చుకుని ఆ తరువాత నెలవారీ చెల్లింపుల ద్వారా క్రెడిట్ కార్డు అప్పు తీరుస్తుంటారు. కానీ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఆర్భీఐ ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇప్పటిదాకా ఉన్న సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇకమీదట పొందలేరు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బ్యాంకు ఖాతా ఉన్న చాలామంది క్రెడిట్ కార్డులు(credit card) వాడుతుంటారు. క్రెడిట్ కార్డు సహాయంతో కావలసిన అవసరాలు తీర్చుకుంటూ ఆ తరువాత నెలవారీ చెల్లింపులు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు కొందరు తెలివిగా ఆలోచించేవారు. దీనిప్రకారం నెలవారీ చెల్లింపు చేసేటప్పుడు నిర్ణీత చెల్లింపుకు మించి డబ్బు అదనంగా చెల్లించేవారు. కార్డ్ లిమిట్ దాటిపోకూడదనే కారణంతో ఈ పని చేసేవారు. ఇలా అదనంగా చెల్లించినప్పుడు ఆ డబ్బు మళ్లీ తిరగి వాపసు వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ(RBI) ఆ సౌకర్యాన్ని తీసేసింది. ఇలా అదనంగా డబ్బు జమచేయడాన్ని నిషేదించింది. ఒకవేళ ఎవరైనా క్రెడిట్ కార్డు చెల్లింపు సమయంలో అదనంగా డబ్బు చెల్లించినా అది తిరిగి వాపసు ఇవ్వరని అంటున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లేముందు క్రెడిట్ కార్డులలో అదనపు డబ్బును జమచేసుకుంటూ ఉంటారు. విదేశాల్లో షాపింగ్ చేయడానికి ఆ డబ్బును వినియోగిస్తారు. ఎక్కువ షాపింగ్ చేసినా కార్డు లిమిట్ దాటదనే ఆలోచనతో ఇలా చేసేవారు. ఇప్పుడు ఆ సౌకర్యం తీసేశారు.
Heart Attack in Younger Age: 30 ఏళ్ల వయసు కూడా లేకున్నా హార్ట్ అటాక్‌లు.. ఈ 5 అంశాలే అసలు కారణాలు..!
క్రెడిట్ కార్డు ద్వారా మనీ లాండరింగ్, మోసాలు అరికట్టడానికి బ్యాంకులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఆ దిశగా వేసిన పెద్ద అడుగే ఇది. చాలావరకు అంతర్జాతీయ లావాదేవీల్లో పెద్దమొత్తం డబ్బును ఉపయోగించకుండా నిరోధించడం, క్రెడిట్ కార్డు ఖాతాలలో డబ్బు అదనంగా ఉంచకుండా చేయడం దీని ఉద్దేశం. ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి క్రెడిట్ కార్డులకు నగదు బదిలీ చేసి దాని ద్వారా అంతర్జాతీయ లావాదేవీలు జరుపుతున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. అయితే దీనివల్ల కస్టమర్లకు కలిగే నష్టం ఏమీ ఉండదని, తెలివిగా క్రెడిట్ కార్డులు వినియోగించుకుంటే ఎలాంటి ఇబ్బందులుఉండవని బ్యాంకులు చెబుతున్నాయి. ప్రస్తుతానికి హెచ్‌డిఎఫ్‌సి(HDFC), ఎస్‌బిఐ(SBI), యాక్సిస్(AXIS) బ్యాంకులు తమ కస్టమర్లు ఎక్కువ చెల్లింపులు చేయకుండా నిరోధించాయి. ఐసిఐసిఐ(ICICI) బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు మాత్రం యాంటీ మనీ లాండరింగ్ కోణంలో ఎక్కువ మొత్తం పేమెంట్ చేయవచ్చు.