G Square: ఇక ఉత్తర భారతదేశంవైపు చూపు!
ABN , First Publish Date - 2023-01-31T20:45:21+05:30 IST
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్లలో ఒకటైన జీ స్క్వేర్ (G Square) ఇప్పుడు ఉత్తర భారతదేశంవైపు దృష్టి సారించింది
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్లలో ఒకటైన జీ స్క్వేర్ (G Square) ఇప్పుడు ఉత్తర భారతదేశంవైపు దృష్టి సారించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్(Hyderabad), మైసూరు(Mysore) వంటి నగరాలకు విస్తరించిన జీ స్క్వేర్ 10 నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించింది. ఇందులో కర్ణాటక ప్రాజెక్టు విలువ రూ. 1000 కోట్లు కాగా, హైదరాబాద్ ప్రాజెక్టు విలువ రూ. 2,500 కోట్ల వరకు ఉంది. ఇవి కాక తమిళనాడులో రూ. 2 వేల కోట్ల ప్రాజెక్ట్ కూడా ఉంది. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఉద్యోగుల సంఖ్యను 600 నుంచి 1300కు పెరిగింది. అలాగే, రూ. 2 వేల కోట్ల విక్రయాలను నమోదు చేసింది. త్వరలోనే ఈ కంపెనీ పూణె(Pune), జైపూర్(Jaipur)లలో సైతం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
జీ స్క్వేర్ హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి ప్రాజెక్ట్ జీస్క్వేర్ ఈడెన్ గార్డెన్(G Square Eden Garden)ను ప్రారంభించింది. వినియోగదారుల నుంచి దీనికి అపూర్వ స్పందన లభించింది. నాలుగు రోజుల్లోనే 250కు పైగా బుకింగ్స్ జరిగాయి. మైసూరులో ప్రారంభించిన జీస్క్వేర్ ప్లాసియా, హైదరాబాద్‌లో ప్రారంభించిన జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీకు అపూర్వ స్పందన లభించింది.
ఈ సందర్భంగా జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ శ్రేణి సౌకర్యాలు, ఫీచర్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మార్కెట్‌లలో అద్భుతమైన స్పందన లభించిందని, ఇప్పుడు ఉత్తర భారతదేశానికి తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్టు తెలిపారు. ప్లాట్ ప్రాజెక్ట్‌లకు అత్యధిక డిమాండ్ ఉన్న జైపూర్‌తో పాటు పూణెలోనూ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.