2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం
ABN , First Publish Date - 2023-07-30T21:28:19+05:30 IST
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
పాట్నా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) బీజేపీ (BJP) తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా (INDIA) గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) జోస్యం చెప్పారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన నివాసంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ఆర్జేడీ విద్యార్థి విభాగం సమావేశంలో లాలూ ప్రసాద్ పాల్గొన్నారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ద్వారా బీజేపీకి చరమగీతం పాడాలన్నారు. ప్రతిపక్షాల విపక్ష కూటమి 'ఇండియా' త్వరలో మహారాష్ట్రలో సమావేశమై తదుపరి వ్యూహాన్ని ఖరారు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని, దేశం కోసం పోరాడేందుకు అన్నింటినీ వదులుకుని ముందుకు రావాలని పార్టీ యువజన విభాగానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సా 26 ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి మూడో సమావేశం త్వరలో బెంగళూరులో జరుగనుంది. తొలి సమావేశం జూన్ 23న బీహార్ సీఎం నేతృత్వంలో పాట్నాలో జరుగగా, రెండో సమావేశంలో జూలై 17-18 తేదీల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగింది. ముంబై సమావేశానికి కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ పవార్ కూటమి ఆతిథ్యం ఇవ్వనుంది.