Share News

Operation Ajay: టెల్ అవివ్‌లో స్పైస్ సెట్ విమానానికి సాంకేతిక లోపం..

ABN , First Publish Date - 2023-10-16T16:48:41+05:30 IST

ఆపరేషన్ అజయ్ కింద న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ వెళ్లిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సాంకేతక లోపాన్ని సరిచేసేందుకు పొరుగు దేశమైన జోర్డాన్‌కు విమానాన్ని తరలించారు. స్పైస్ జెట్ ఆవిషయమై తక్షణం స్పందించలేదు.

Operation Ajay: టెల్ అవివ్‌లో స్పైస్ సెట్ విమానానికి సాంకేతిక లోపం..

టెల్ అవివ్: ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కింద న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ (Tel Aviv) వెళ్లిన స్పైస్ జెట్ (Spice jet) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సాంకేతక లోపాన్ని సరిచేసేందుకు పొరుగు దేశమైన జోర్డాన్‌కు విమానాన్ని తరలించారు. హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' పేరుతో విమానాలను నడుపుతోంది. స్పైస్ జెట్‌కు చెందిన A340 విమానం ఈ ఆపరేషన్‌లో పాల్గొంటోంది.


స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా జోర్డాన్‌కు విమానం తరలించడంపై విమానయాన సంస్థ తక్షణం ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే A340 విమానం టెల్ అవివ్ వెళ్లినట్టు మాత్రం తెలిపింది. కాగా, ఆపరేషన్ అజయ్ పేరుతో కేంద్రం ఇంతవరకూ నాలుగు విమానాల్లో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను న్యూఢిల్లీకి తీసుకువచ్చింది. 274 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం ఆదివారంనాడు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ పట్టణాలపై హమాస్ దాడులు మొదలుపెట్టడంతో యుద్ధం మొదలైంది. ఇందుకు ప్రతిగా గాజాను అష్టదిగ్బంధం చేసేందుకు ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్‌కు దిగడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 18,000 మంది భారతీయుల్లో స్వదేశానికి రావాలని కోరుకుంటున్న వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అక్టోబర్ 12న ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది.

Updated Date - 2023-10-16T16:48:41+05:30 IST