Summer holidays: మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు

ABN , First Publish Date - 2023-06-06T07:44:14+05:30 IST

రాష్ట్రంలో ఎండలు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల సెలవులను ఈ నెల 11 వరకూ పొడిగిస్తున్నట్లు పాఠశాలల విద్యాశాఖ మంత్రి అ

Summer holidays: మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల సెలవులను ఈ నెల 11 వరకూ పొడిగిస్తున్నట్లు పాఠశాలల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి(Minister Anbil Mahesh Poiyamoli) ప్రకటించారు. సోమవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)ను సచివాలయంలో కలుసుకుని పాఠశాలల పునఃప్రారంభం విషయంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో అగ్నినక్షతం మే 29న ముగిసినప్పటికీ పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా సెలవులను పొడిగిస్తే మంచిదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలకు సెలవులు పొడిగించినట్లు ఆయన తెలిపారు. తొలుత వార్షిక పరీక్షల అనంతరం రాష్ట్రంలో 1 నుంచి ఐదు తరగతులకు ఈ నెల 5న, ఆరు నుంచి పదో తరగతి వరకు ఈ నెల 1న పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాలల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖఅధికారుల పర్యవేక్షణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకరణాలను, పాఠ్యఫుస్తకాలను సరఫరా చేశారు. అదే సమయంలో అన్ని పాఠశాలల్లో పారిశుధ్య పనులను కూడా చేపట్టి పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎండలు తగ్గకపోవటంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని మరికొద్ది రోజులపాటు వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు ఈ నెల 6వ తేదీ వరకు పాఠశాలల సెలవును పొడిగిస్తూ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి ప్రకటన జారీ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ నెల ప్రారంభం నుంచి ఎండలు అధికం కావడం, పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు కూడా ఈ నెల 15 తర్వాతే ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. గత రెండు రోజులుగా పాఠశాలలను పునఃప్రారంభించే విషయమై మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి విద్యాశాఖ అధికారులతో చర్చలు జరుపుతూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానంతరం మంత్రి అన్బిల్‌ మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల సెలవులను ఈ నెల 11 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచన మేరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను ఈ నెల 12న ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పాఠశాలలను ఈ నెల 14 నుండి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Anasuya: బీచ్‌లో బికినీతో అన‌సూయ లిప్ లాక్‌.. బాబోయ్ ఏంటి మరీ ఈ అరాచకం..!

nani1.2.jpg

Sharwanand Marriage: ఘ‌నంగా శ‌ర్వానంద్ పెళ్లి.. ఫొటోలు వైర‌ల్‌

Rakul Preet Singh: బికినీతో బీచ్‌లో రచ్చ రచ్చ చేస్తోన్న రకుల్.. ఫొటోలు వైరల్..!

Updated Date - 2023-06-10T08:39:33+05:30 IST